విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

Jan 19,2024 16:18 #elections, #hyderabad, #vidya committee

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీలు, మోడల్‌, సాధారణ, ఎయిడెడ్‌, జనరల్‌ గురుకులాలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. 1-8 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గని ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యులను ఎన్నుకుంటారు. శనివారం నోటిఫికేషన్‌ ఇచ్చి.. పేరెంట్స్‌ జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. కాగా 2019లో చివరిగా ఎన్నికలు జరిగాయి.

➡️