విశాఖలో నౌకాదళ విన్యాసాలు

Dec 10,2023 17:13 #Navy Day, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖపట్నం: నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యి విన్యాసాలను విక్షించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్‌ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేశారు. నేవీ డే సందర్భంగా ఆర్కే బీచ్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

➡️