వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్‌ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్‌ తన తండ్రి దివంగత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి జగన్‌ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంటు స్థానం పరిధిలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. వేంపల్లి, వీఎన్‌ పల్లి, యర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్‌, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు.

➡️