వైసిసి బిసిసెల్‌ అధికార ప్రతినిధిగా నాగిడి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వైసిపి బిసి సెల్‌ అధికార ప్రతినిధిగా నాగిడి సాంబశివరావును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ బిసిలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు.. తన నియామకానికి కృషిచేసిన మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, జోగి రమేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.నాగరాజు, సైకం సాయిబాబు, వి.మణికంఠ, ఎస్‌.చినబాబు, ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️