షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌లో ఐటి దాడులు..

Dec 19,2023 12:08 #it raids, #Kadapa

ప్రజాశక్తి-కడప : కడపలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప శివారులోని పారిశ్రామికవాడలో ఉన్న ఆ సంస్థకు చెందిన కర్మాగారం, హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో సైతం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన 40 మంది ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 50 మంది సిఆర్పిఎఫ్‌ పోలీస్‌లు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

➡️