షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు

Dec 20,2023 09:24 #it raids, #Kadapa

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప నగర శివారులోని పారిశ్రామికవాడలో ఏర్పాటైన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 40 మంది ఐటి అధికారులు సోమవారం రాత్రి చేపట్టిన సోదాలు మంగళవారం వరకూ కొనసాగాయి. 50 మంది సిఆర్‌పిఎఫ్‌ పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ గత నాలుగేళ్లుగా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కాంట్రాక్టుల దగ్గర నుంచి జలాశయాల వెనుకజలాల నుంచి రివర్స్‌ హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే కాంట్రాక్టు పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటి అధికారుల విభాగం తనిఖీలు కొనసాగిస్తోంది. కంపెనీ దస్త్రాల పరిశీలనతో పాటు, దాని అనుబంధ సంస్థలు, కడప, హైదరాబాద్‌ నగరాల్లోని కంపెనీ యజమాని సమీప బంధువుల ఇళ్లను కూడా సోదాలు చేసినట్లు తెలిసింది.

➡️