సాహిత్య ప్రస్థానం 20 వసంతాలు- రేపు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ 

ప్రజాశక్తి – విజయవాడ: ‘సాహిత్య ప్రస్థానం’ మాసపత్రిక 20 వసంతాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బాలోత్సవ్‌ భవనంలో జరుగుతుంది. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్‌ అధ్యక్షతన జరిగే సభలోా నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ జి.అనిత ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. పత్రిక ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి ప్రసంగిస్తారు. ప్రముఖ కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌, ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య పాల్గొంటారు. ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ ఈ ప్రత్యేక సంచికను పరిచయం చేస్తారు. ఈ సభకు కవులు, రచయితలు, సాహిత్య ప్రియులూ హాజరు కావాల్సిందిగా సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యరంజన్‌ కోరారు.

➡️