సిట్టింగ్‌ లను మార్చి ఉంటె బాగుండేది : కేటీఆర్‌

Jan 7,2024 15:12 #KTR, #press meet

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అన్నారు. జహీరాబాద్‌ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు నిజాం సాగర్‌ మండలం లో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందన్నారు. ‘బంధు ‘పథకాల ప్రభావం మనపై పడిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని అన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్‌ రెడ్డి కమిషన్‌ వేస్తామంటున్నారని కేటీఆర్‌ అన్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా పోస్టులు పెడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ ఊపందుకుంది.

➡️