సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

Feb 9,2024 16:15 #minister buggana, #press meet

అమరావతి : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. మరికొందరు నేతలతో సమావేశం అయ్యారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ పనులు, పోలవరం.. ఇతర అంశాలపై చర్చించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్‌ పుట్టిస్తోన్న సమయంలో.. ఢిల్లీలో సాగుతోన్న సీఎం జగన్‌ పర్యటనను రాజకీయాలకు ముడిపెట్టి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. ఈ నేపథ్యంలో.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. విభజన హామీలు, రాష్ట్ర అవసరాల కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారని  తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మినహా అన్ని పార్టీలతోనూ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.. భావ వైరుధ్యం కలిగిన పార్టీలతోనూ రెండు రెండు సార్లు కలిసిన పార్టీ.. టీడీపీ..! అదేమీ రాజకీయమో అర్థం కాదు అని దుయ్యబట్టారు. జనసేన సిద్ధాంతం ఏమిటో అర్థం కాలేదని సెటైర్లు వేసిన ఆయన.. వైఎస్సార్‌ ఆశయాలు, పేదల సంక్షేమమే మా విధానం.. సొంత విధానంలేకే టీడీపీ కంప్లికేట్‌ అవుతోందని విమర్శించారు. ఎవరి కారును వాళ్లు నడిపితే గమ్యం చేరడం ఈజీ.. కానీ, మన కారును పక్కవాళ్లు నడిపితే అభద్రత భావం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో స్కిల్‌ డవలప్‌ మెంట్‌ అంటే స్కాం.. నాలుగు రోజులు శిక్షణలో ఏమి నేర్పించి వుంటారో ఇప్పటికీ అర్థం కాదని విమర్శలు గుప్పించారు.

➡️