మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌కు 010 పద్దు

May 23,2024 23:15 #010, #model school teachers

– ఎపిఎంఎస్‌టిఎఫ్‌ కన్వీనర్‌ చంద్రశేఖర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల జీతభత్యాలు 010 పద్దు కింద చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ పి చంద్రశేఖర్‌, కో కన్వీనర్‌ బాలాజీ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తుర్వులు సక్రమంగా అమలు జరగాలంటే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో గురువారం వర్కుషాప్‌ జరిగింది. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ సొసైటీ పరిధి నుంచి తప్పించి పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేవాలని సమావేశంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్‌ సిబ్బందికి రావాల్సిన అన్ని సర్వీస్‌ ప్రయోజనాలపై జిల్లాల్లోని అందరి అభిప్రాయాలను క్రోఢకీరించి అధికారులకు సమర్పించాలని తెలిపారు. మోడల్‌ స్కూల్స్‌ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు తమ సహకారం ఉంటుందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

➡️