పల్టీలుకొట్టిన ఆటో – 10మందికి గాయాలు- ఒకరికి తీవ్రగాయాలు

May 15,2024 13:32 #10 members, #injured, #Overturned auto

కర్లపాలెం (బాపట్ల) : ఆటో పల్టీలు కొట్టి పడటంతో 10మందికి గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం బాపట్ల జిల్లాలోని నల్లమోతువారిపాలెం సత్యవతి పేట జాతీయ రహదారి పై జరిగింది. నిజాంపట్నంకు చెందిన ఆటో ఏపీ 39 హెచ్‌ 1182 నెంబర్‌ ఉన్న ఆటో ఓవర్‌ స్పీడ్‌ తో వస్తూ పక్కనే ఆగి ఉన్న బైకును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో దాదాపు పదిమంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని వెంటనే 108 వాహనంలో బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️