ఎల్లుండి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 22,2024 22:55 #10th, #Ellundi, #Supplementary Exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 3 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాటు చేసింది. మొత్తం 685 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8:45 నుంచి 9:30 గంటల్లోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతినిస్తారు. హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే విడుదల చేసింది. 685 చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, 685 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 6,900 మంది ఇన్విజిలేటర్లు, 86 మంది ఫ్లైంగ్‌ స్క్వాడ్స్‌ను నియమించారు.

➡️