24 మంది వలంటీర్లు రాజీనామా

Apr 1,2024 22:49 #registration, #volunteers

ప్రజాశక్తి- పరవాడ, అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో సోమవారం 24 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. పరవాడ మండలం తానాం గ్రామంలో రాజీనామా చేసిన 23 మంది వలంటీర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, జెడ్‌పిటిసి సభ్యులు పిఎస్‌.రాజు, వైసిపి సిఇసి సభ్యులు పైలా శ్రీనివాసరావు, గొర్లి గోపి, చుక్క రామనాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలోని 84వ వార్డు తాకాశి వీధి సచివాలయం పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్న శఠగోపం వెంకట విజయ కూడా రాజీనామా చేశారు.

➡️