240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Dec 30,2023 21:56 #APPSC, #job notification

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పరీక్షలు ఏప్రిల్‌/మే లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కొ పేపర్‌ 150 మార్కులు చొప్పున రెండు పేపర్లలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు నెగిటీవ్‌ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ జూరష.aజూ.స్త్రశీఙ.ఱఅ ను సందర్శించాలని తెలిపారు.

➡️