రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 08:19 #ap cm jagan, #paryatana

– 8 వరకు మహోత్సవాలు

– మంత్రి బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఉన్న రూ.2,750 పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని మండల, మున్సిపల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జనవరి 1 నుంచి 8 వరకు పెన్షన్‌ పెంపు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 3న కాకినాడలో జరిగే పెన్షన్‌ మహోత్సవంలో సిఎం జగన్‌ పాల్గంటారన్నారు. కొత్తగా 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేశామన్నారు. మొత్తం పెన్షన్ల పంపిణీకి ఇప్పటికే రూ.1,968 కోట్లు విడుదల చేశామన్నారు.

➡️