శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు 30 జింకలు తరలింపు

Feb 20,2024 16:43 #jinkalu, #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : కాకినాడ నాగార్జునసాగర్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గ్రీన్‌ బెల్ట్‌ పార్కులో సెంట్రల్‌ జూ అధారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతితో కొనసాగుతున్న జూ పార్కులో ఉన్న 200 జింకలలో మొదటి విడతగా 30 జింకలను నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు తరలించినట్లు కోరంగి వన్యప్రాణి విభాగం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఎస్‌.ఆర్‌.వరప్రసాద్‌ తెలిపారు. చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ఉత్తర్వుల అనుసరించి జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్‌. భరణి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ టైగర్‌ పశు వైద్యులు అరుణ్‌ వెస్లీ, శ్రీ వెంకటేశ్వర జూపార్క్‌ తిరుపతి , ఇందిరా ప్రియదర్శిని జూ పార్క్‌ విశాఖపట్నం పశువైద్య బృందం ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన బొమా టెక్నిక్‌ ద్వారా వన్యప్రాణులను పట్టుకుని వాటిని తరలిస్తున్నట్లు తెలిపారు. వన్య ప్రాణులకు ఏ విధమైన ఒత్తిడి లేకుండా రిస్క్యూ చేసి తరలించే బొమా టెక్నిక్‌ ప్రక్రియ ద్వారా వీటిని పట్టుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో భాగంగా 16వ తేదీన పట్టుకుని 37 జింకలను 17వ తేదీన నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు నకు తరలించి మదువైన ఎంక్లోజర్‌ ద్వారా నూరు శాతం సురక్షితంగా టైగర్‌ రిజర్వులోనికి విడిచిపెట్టడం జరిగిందని తెలిపారు.

➡️