50 మంది వైసిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసిపి ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.గోరంట్ల మాట్లాడుతూ.. ”సీఎం జగన్‌కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టిడిపిలో చేరుతున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో దోపిడీ చేశారు. జగన్‌ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుంది? కేసుల నుంచి తప్పించుకోవడం ఆయనకు అలవాటైపోయింది” అని విమర్శించారు.

➡️