మోకిలాలో భారీగా గంజాయి పట్టివేత

Jan 18,2024 14:46 #ganjai, #seaz

హైదరాబాద్‌ : గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విస్త్రుతంగా తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా మోకిలాలో 44 కేజీల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు.గంజాయిని బ్రౌన్‌ కలర్‌ ప్యాకెట్స్‌లో ప్యాకింగ్‌ చేసి హైదరాబాద్‌ నగరంలో విక్రయించే యత్నం చేసిన కేటుగాళ్ల ఆట కట్టించారు. మహారాష్ట్రకు చెందిన ఓ లేడి కిలాడితో పాటు మరో ఇద్దరని అరెస్ట్‌ చేశారు. ఎడీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

➡️