పంజాగుట్టలోని అపార్ట్‌మెంటులో భారీ అగ్నిప్రమాదం

Dec 22,2023 09:47 #apartment, #Fire Accident, #Panjagutta

పంజాగుట్ట (హైదరాబాద్‌) : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంటులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్‌ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రావణ్‌ కుమార్‌ కాపాడారు. అక్కడ ఉన్న డంబెల్‌ సహాయంతో డోరును బద్దలు కొట్టి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు.

➡️