దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల భారీ సొరంగం గుర్తింపు

Jan 31,2024 15:58 #mavoist

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. గాలి, వెలుతురు వచ్చేలా.. ఒక మనిషి నడిచి వెళ్లేంత వెడల్పుతో వీటిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఈ సొరంగాల నుంచి వచ్చిన మావోయిస్టులు మంగళవారం బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️