మొబైల్‌ కోసం వ్యక్తి దారుణ హత్య

May 1,2024 07:47 #crime
upadhi worker died

హైదరాబాద్‌: మొబైల్‌ కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషాద సంఘటన నగరంలోని గుడిమల్కాపూర్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచారు. అనంతరం దుండగులు మొబైల్‌ తీసుకొని బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

➡️