భారతి సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ

Jan 6,2024 11:16 #Bharti Cements, #setback

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డిలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డిలను ఇడి విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంలో ఇడి సవాల్‌ చేసింది. ఇడి వాదనలతో ఏకీభవిస్తూ జస్టిస్‌ అభరు ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. భారతి సిమెంట్స్‌ ఎఫ్‌డిల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు పొంది ఎఫ్‌డిలను విడుదల చేయాలన్న తీర్పును పున:పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

➡️