సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు మృతి

Feb 19,2024 11:59 #death, #Kakinada, #Visakha
A young man died after going for a sea bath

ప్రజాశక్తి-యు కొత్తపల్లి : విశాఖపట్నంకు చెందిన యువకుడు సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటన యు కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. బషీర్ బేబీ ఊరుస్ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చివర రోజు పొన్నాడ ఉన్న దర్గాను దర్శించుకోవడానికి వచ్చిన విశాఖపట్నంకి చెందిన యువకుడు మూలపేట తీరంలో రాత్రి సమయంలో సముద్ర స్నానానికి వెళ్ళగా అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో సముద్రంలో గల్లంతైయ్యాడు. సోమవారం గల్లంతైన మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️