ఎసిబికి చిక్కిన సిఐ ఇంటిలో సోదాలు

Apr 27,2024 22:19 #ACB RIDS

– నగదు, విలువైన పత్రాలు స్వాధీనం
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ :అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఏలూరు మూడో పట్టణ సిఐ వెంకటేశ్వరరావు ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. పది లక్షల నగదు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ఏలూరు జిల్లా సత్రంపాడుకు చెందిన విక్టర్‌బాబుపై మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడికి 41ఎ నోటీసు ఇచ్చేందుకు సిఐ రూ. 50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. కానిస్టేబుల్‌కు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ కేసులో శుక్రవారం రాత్రి, శనివారం సిఐ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.

➡️