ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Jan 24,2024 12:32 #ap congress, #Congress candidate

ప్రజాశక్తి-విజయవాడ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు అందించారు. ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్తకు అప్లికేషన్‌ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. కాగా మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ అందజేశారు.

➡️