గోపీచంద్‌ను అభినందించిన ఆచార్య యార్లగడ్డ

May 23,2024 13:41 #Indian Space, #Telugu states
  • ఎన్ టి ఆర్ స్మారక వంద రూపాయల నాణెం బహుకరణ

దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్యి ప్రసాద్ అభినందించారు. విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుని హోదాలో అంతర్జాతీయంగా హిందీ భాష అభివృద్ది కోసం వివిధ దేశాలలో పర్యటిస్తున్న యార్లగడ్డ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. బుధవారం యుఎస్ఎ లోని గోపిచంద్ నివాసానికి వెళ్లిన లక్ష్మి ప్రసాద్ భారత తొలి అంతరిక్ష పర్యటకుడిగా చరిత్ర సృష్టించారని అభినందించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా, తొలి తోలుగు వ్యక్తిగా గుర్తింపు సాధించటం చిన్న విషయం కాదన్నారు. ఈ సందర్బంగా తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు స్మారకార్దం భారత ప్రభుత్వం విడుదల చేసిన వంద రూపాయల నాణాన్ని గోపిచంద్ కు ఆచార్య యార్లగడ్డ బహుకరించారు. అత్యంత విలువైన బహుమతిని అందుకోవటం పట్ల తోటకూర ఆనందం వ్యక్తం చేసారు.

➡️