ఎమ్మెల్యే వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలి : సీతంరాజు సుధాకర్‌ డిమాండ్‌

Jan 17,2024 20:55 #press meet, #sithamraju sudhakar

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం):విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన రామబాణం కళాశాలలో చట్ట వ్యతిరేకంగా మద్యం, కోడి పంపిణీ జరిగిందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ తెలిపారు. దీనిపై ఎక్సైజ్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ నగరంలోని ఒక హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా తనకు ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. అందుకే ఆ పార్టీని వీడానని, త్వరలోనే మరో పార్టీలో చేరుతానని తెలిపారు. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్‌లో చేరడంలేదని, రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీలున్నాయని, అందులో ఓ పార్టీలో చేరుతానని చెప్పారు. తనతోపాటు పలువురు కార్పొరేటర్లు, వైసిపిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులూ చేరుతారని చెప్పారు.

➡️