విశాఖ ఉత్తరం నుంచి పోటీ : వివి లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ, సీతమ్మధార (విశాఖపట్నం) : రానున్న ఎన్నికల్లో తాను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు, ఎపి యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ వివి.లక్ష్మీనారాయణ ప్రకటించారు. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ టార్చ్‌ లైట్‌ గుర్తు కేటాయించినట్టు చెప్పారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. ఆల్‌ తెలుగు ప్రజా పార్టీ జాతీయ నాయకులు డాక్టర్‌ కె.శివ భాగ్యారావు, ప్రభుద్ధ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జిఎస్‌ఆర్‌కెఆర్‌.విజరు కుమార్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు షేక్‌ జలీల్‌, నవతరం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️