వైసిపికి ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా

  •  కాంగ్రెస్‌లో చేరే అవకాశం !

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) : వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రకటించారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన చీరాల టికెట్‌ కేటాయించకపోవడంతో గత కొంత కాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన ఇంటి వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. ప్రజాభీష్టం మేరకు వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ఆమంచి తెలిపారు. తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల తొమ్మిదిన ప్రజల సమక్షంలో ప్రకటిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌.షర్మిల, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని అంటున్నారు.

➡️