తాళాలు పగలగొట్టి అంగన్వాడి కేంద్రాలు స్వాధీనం

Dec 17,2023 12:55 #Anganwadi Centers, #seized

తాడికొండ (గుంటూరు) : తాడికొండ మండలంలో ఆదివారం ఉదయం నుండి సచివాలయ సిబ్బందితోపాటు అంగన్వాడీ సూపర్వైజర్లు కలిసి తాళాలను పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేంద్రంలోని స్టాక్‌ ను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం నుండి స్టాక్‌ ను ఆనిమేటరు  డ్వాక్రా గ్రూపుల వారితో లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో 69 కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

➡️