అంగన్‌వాడీల 24 గంటల దీక్ష

anganwadi workers strike 25th day vja

 

విజయవాడలో ప్రారంభించిన ఎఆర్‌ సింధు

-అంగన్‌వాడీల సంక్షేమాన్ని విస్మరించడమంటే కోర్టు ధిక్కరణే

-సమ్మెకు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు

ప్రజాశక్తి- విజయవాడ, యంత్రాంగం :అంగన్‌వాడీల సమ్మె 24వ రోజుకు చేరిన సందర్భంగా 24 గంటల రాష్ట్ర స్థాయి దీక్షలను ఆల్‌ ఇండియా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధు విజయవాడలోని ధర్నా చౌక్‌లో శుక్రవారం ప్రారంభించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (సిఐటియు), ఎఐటియుసి, ఐఎఫ్‌టియుకు చెందిన ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల నేతలు, కార్యకర్తలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. వారి మెడల్లో పూల దండలను వేసి ఈ దీక్షలను సింధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రంలోని మోడీ, ఆంధ్రప్రదేశ్‌లోని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు, దాడులు, కేసులు వంటి వాటిని మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో, ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయకపోవడం సరికాదన్నారు. అంగన్‌వాడీల కేంద్రాల లబ్ధిదారులుగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నారని తెలిపారు. పౌష్టికాహార లోపంతో ప్రతి రోజు 29 వేల మంది పిల్లలు మృత్యువాతపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐసిడిఎస్‌ సంస్థకు దేశంలో పది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఏడాదికి కేటాయించడం అత్యంత దారుణమన్నారు. కానీ, దేశంలోని 15 నుంచి 20 మంది కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం రూ.మూడు నుంచి ఐదు లక్షల కోట్ల వరకు పన్ను రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. డబ్బులు లేకపోవడం కాదని, ప్రభుత్వాల విధానాలు అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని లేదని వివరించారు. 2018 తరువాత అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ నిర్బంధాలకు, అరెస్ట్‌లకు, కేసులకు అంగన్‌వాడీలు భయపడే వారు కాదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశారని వివరించారు. అంగన్‌వాడీల ఉద్యమానికి అండగా సిఐటియు, ఎఐటియుసి, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతునిస్తున్నాయని తెలిపారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ అంగన్‌వాడీల ఉద్యమానికి ఎఐటియుసి, ఇతర కార్మిక సంఘాలు అండగా ఉన్నాయన్నారు. ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలు తప్పక విజయం సాధిస్తారని, వారి పోరాటానికి గ్రామ స్థాయి నుంచి మద్దతు కూడగడుతున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమ్మెకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల తరుఫున మద్దతు ప్రకటించారు. దీక్షల్లో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కె సుబ్బరావమ్మ, నాయకులు ఎం.నాగశేషు, జి.చీమరాణి, టి.గజలక్ష్మి, యల్లారాణి, సైలజ, ఎ.రమాదేవి, బి.రజీనారాణి, శైలజ, లతకుమారి, కుమారి, మల్లేశ్వరి, నాగలక్ష్మి, జె లలితమ్మ, ప్రేమ, హెల్డ్‌, ఆర్‌ కృష్టేనమ్మ, జె గంగావతి, శోభ తదితరులు కూర్చున్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి అధ్యక్షత వహించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఎఆర్‌.సింధు, రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి, రాష్ట్ర కార్యదర్శి రోజా సందర్శించి మద్దతు తెలిపారు. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అంగన్‌వాడీలకు అధికారులు జారీ చేసిన నోటీసులను ఈ శిబిరం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంగన్‌వాడీలకు యూనిఫైడ్‌ సర్వీసు రూల్స్‌ తీసుకురావాలని, కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. వివిధ సంఘాల మద్దతుతిరుపతి పాత కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని మెడికల్‌ రెప్స్‌, 108, 104 ఉద్యోగులు సందర్శించి మద్దతు తెలిపారు. మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రామకృష్ణ అంగన్‌వాడీ కార్మికులకు కమలాపండ్లను అందించారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో అంగన్‌వాడీలకు కౌలు రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరులో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కేంద్రం ఎదుట అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకుల బృందం సందర్శించి మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే బాలరాజును అడ్డుకున్న అంగన్‌వాడీలుఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఎంఎల్‌ఎ బాలరాజును అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. దీంతో, ఆయన సమ్మె శిబిరం వద్దకు వచ్చి మాట్లాడారు. శ్రీకాకుళంలో అంగన్‌వాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపించిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవి.పద్మావతి నివాసం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్‌వాడీలను అసభ్య పదజాలంతో అవమానించిన వైసిపి సోషల్‌ మీడియాకు చెరదిన అజరుపై మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

  • కోడుమూరులో రిలే నిరాహార దీక్షలు

కర్నూల్ జిల్లా-కోడుమూరు : కోడుమూరు మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు వారు చేస్తున్నటువంటి సమ్మె 25వ రోజు చేరిన సందర్భంగా రోజువారీగా రిలే నిరాహారులు దీక్షలు చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా చేసిన ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనియకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి అంగన్వాడీల హక్కులను కాలరాశారు. ఈ సందర్భంగా శాంతియుతంగా కూడా చేయనియ్యని ఈ ప్రభుత్వంపై రాబోయే రోజుల్లో ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుతూ రిలే నిరాహార దీక్షలను చేయడం జరిగింది. కోడుమూరులో రిలే దీక్షలో అంగన్వాడి నాయకురాళ్లు అరుణ హైమావతి మరియు గీత హేమలత దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వీరన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని కమిటీ నిర్ణయించింది. పై నిర్ణయం ప్రకారం కోడుమూరులో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రిలే దీక్షలు రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకైనా వెనకాడేది లేదని వారన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయభారతి, సూలమ్మ ఫాతిమా, రజియా, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 25th day bapatla

  • కారంచేడులో దున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు

బాపట్ల జిల్లా-కారంచేడు : ప్రభుత్వం కంటే దున్నపోతు నయం నయం ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కనీస వేతనాలు ఇవ్వాలని కారంచేడు లో అంగన్వాడీలు దున్నపోతుకు అర్జీ ఇచ్చారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా  శుక్రవారం నాడు కారంచేడు తాసిల్దార్ కార్యాలయం వద్ద 25వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతూ దున్నపోతుకు అర్జీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆరు నూరైనా ప్రభుత్వం జీతాలు పెంచేంతవరకు తమ ఆందోళన వీడేది లేదని అన్నారు. గతంలో కూడా 50 రోజులు 70 రోజులు సమ్మె చేసిన ఉద్యోగులు ఎవరు సస్పెండ్ కాలేదని సమ్మె హక్కు కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని సంవత్సర కాలంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని జీతాలు పెంచాలని అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. అనేక ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాల మద్దతు తమ సమ్మెకు ఉందని సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ఆందోళన కొనసాగుతుందని రేఖ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈ కొండయ్య ఇంకొల్లు ప్రాజెక్టు అధ్యక్షురాలు హైమావతి, మండల అంగన్వాడి నాయకులు అనిత, క్రీస్తు రాజ్యం, శివ లీల, కళ్యాణి, హఫీజ, శ్రీదేవి, జ్యోతి, కృష్ణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

municipal workers strike 11th day annamayya

సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని ఐసిడిఎస్ నందు సమ్మెలో భాగంగా 25వ రోజు సోది చెబుతానమ్మ సోది చెబుతా కార్యక్రమము మరియు కబడి కార్యక్రమంతో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు.

anganwadi workers strike 25th day eg

  • కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె రైతు  సంఘం మద్దతు 

తూగో – చాగల్లు  : మండల కేంద్రమైన చాగల్లు  తహసీల్దార్ కార్యాలయం వద్ద  అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె శుక్రవార నాటికి 25వ రోజుకి చేరుకొంది. అంగన్వాడి కార్యకర్తలు మద్దతుగా రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘం మద్దతు తెలిపారు. జిల్లా రైతు సంఘం కన్వీనర్ గారపాటీ  వెంకట సుబ్బారావు మండల కౌలు  రైతు సంఘం అధ్యక్షుడు రామనాథ మురళీకృష్ణ అంగన్వాడి కార్యకర్తలకు మద్దతు తెలిపారు. పి విజయ కుమారి కే లక్ష్మి మాట్లాడుతూ  గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ, ఐసీడీఎస్ ప్రీస్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి విజయ్ కుమారి, కే లక్ష్మి, కే దమయంతి, ఏ శ్రీదేవి, బి మహాలక్ష్మి, ఎస్ అరుణ్ కుమారి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

anganwadi workers strike 25th day alluri

అల్లూరి జిల్లా ఆర్ పురం మండలంలోని రేఖపల్లి జంక్షన్ వద్ద 25 రోజులుగా చేస్తున్న అంగణవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఎటపాక మండలానికి గోకబాక గ్రామానికి చెందిన పద్మ అంగన్వాడి టీచర్ మృతి చెందటంతో ఆమెకు ఐదు నిమిషాలు మౌనం పాటించి, సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు రంగమ్మ మండల కార్యదర్శి రాజేశ్వరి మండల అధ్యక్షులు నాగమణి కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

 

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో భాగంగా 25వ రోజు ఒంటికాలి పై నిలబడి నిరసన తెలిపారు.

 

anganwadi workers strike 25th day tpt

తిరుపతి జిల్లా గూడూరు అంగనవాడి నిరసన కార్యక్రమం 25వ రోజు చేరుకుంది. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రోజు కార్యక్రమాలు భాగంగా గొబ్బెమ్మలు తట్టుకుంటూ శిబిరం నుండి రైల్వే స్టేషన్ మీదగా టవర్ క్లాక్ దగ్గర గొబ్బెమ్మల తట్టి అదేవిధంగా ప్రదర్శనతో నినాదాలు ఇచ్చుకుంటూ రైతు బజార్లో రైతులకి తమ గోడు వినిపించి గొబ్బెమ్మతట్టినారు. నిరసన బాధ ఆలకించి  సంఘీభావం తెలుపుతూ వారు తోసినంత ఆర్థిక సహాయం చేసినారు. అదేవిధంగా ప్రదర్శనలు చేసుకుంటూ గూడూరు పాత బస్టాండ్ నుండి నినాదాలు ఇచ్చుకుం టు శిబిరం చేరుకున్నాము.

anganwadi workers strike 25th day atp

అనంతపురం జిల్లా – అగళి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు 25వ రోజు నిరసన కార్యక్రమాన్ని ఆగలి తాసిల్దార్ కార్యాలయం ముందు ఒంటికాలతో నిలబడి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు.

  • కొనసాగుతున్న సమ్మె

అనంతపురం జిల్లా – పుట్లూరు : మండల కేంద్రంలో 25వ రోజుకు చేరిన అంగన్వాడి సమ్మె అంగనవాడి వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగనవాడి హెల్పర్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ సూరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో అనేక రకమైన కార్యక్రమాలలో నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య వ్యవసా శాఖ య కార్మిక సంఘం మండల కార్యదర్శి బి భాస్కర్ రెడ్డి కుళ్లాయప్ప, కే నాగభూషణ్, అంగన్వాడి టీచర్ యూనియన్ జై లలిత, శశికళ, రమాదేవి, అనంతలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్, తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

 

anganwadi workers strike 25th day alluri

అల్లూరి జిల్లా : మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద వారికి మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్

anganwadi workers strike 25th day eluru

ఏలూరు జిల్లా : అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా 25వ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద 25 అంకెతో నిరసన తెలిపిన అంగన్వాడీలు.

 

anganwadi workers strike 25th day atp

అనంతపురం జిల్లాలో వంటి కాళ్లపై నిలబడి సమ్మె

anganwadi workers strike 25th day manyam

పార్వతీపురం మన్యం జిల్లాలో గడ్డి తింటూ అంగన్వాడీ కార్యకర్తలు

 

anganwadi workers strike 25th day vsp

విశాఖ జిల్లా భీమిలి ఎండిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ధర్నా

anganwadi workers strike 25th day vzm

  • అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది : మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు

విజయనగరం జిల్లా – బొబ్బిలి : అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో లబ్ది కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఐదేళ్ల సమయంలో అంగన్వాడీలు సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని సీఎం ఎన్నికల్లో బయటకు రావడం తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడీలు బయటకు వచ్చారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకదాని ఆరోపించారు. దోపిడీని ఆపితే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి వచ్చిందన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సహకరించకుండా ఐదేళ్లు పాలన చేశారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఒక్కసారి మోస పోవడం సహజం, రెండోసారి మోసపోకుండా వైసీపీకు బుద్ది చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అంగన్వాడీల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలను సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు వివరించారు.. ఆయనతో టీడీపీ సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి, టీడీపీ పట్టణ, మండల అద్యక్షులు రాంబార్కి శరత్, వి.సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో అంగన్వాడీ సిబ్బంది 25వ రోజు రిలే నిరాహార దీక్షలు

anganwadi workers strike 25th day atp a

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అంగనవాడీలు 25 రోజులు చేరుకుంది. శిబిరంలో ప్రజాశక్తి పేపర్ చదువుతున్న అంగన్వాడి కార్యకర్తలు.

➡️