ఎస్మాకు భయపడేదేలే… సమ్మె కొనసాగింపు…

anganwadi workers strike 26th day protest a

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాకు, నిర్బంధాలకు, అరెస్ట్‌లకు, కేసులకు భయపడేది లేదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశామని నిరవధిక సమ్మెను అంగన్వాడీలు 26వ రోజు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 24 గంటల నిరాహార దీక్ష శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ప్రారంభించారు. శుక్రవారం విజయవాడలో ప్రారంభమైన నిరాహార దీక్ష శిబిరానికి ఐలు రాష్ట్ర నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్,  ఆలూరి సుధాకర్,  రమేష్, సంపర శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి మరియు అంగన్వాడీ రాష్ట్ర జిల్లా నాయకులు తదితర సంఘాల నేతలు హాజరయ్యి వారికి   సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడి కార్మికులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఏ ఆర్ సింధు ప్రారంభించి, ప్రసంగించారు.

కనీస వేతనం లేని అంగన్వాడీలకు ఎస్మా ఎలా వర్తిస్తుంది…?

 

జగ్గయ్యపేట పట్టణంలోని అంగన్వాడి, మున్సిపల్ వర్కర్స్ సమ్మె …..

anganwadi workers strike 26th day protes manyam

మన్యం జిల్లా : పాలకొండలో గుంజీలు తీస్తూ నిరసన

anganwadi workers strike 26th day protest vsp

  • ఎస్మాకు భయపడం

విశాఖ – తగరపువలస : తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు శని వారం స్థానిక వై జంక్షన్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐ టి యు భీమిలి జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ప్రయోగించే ఎస్మా లాంటి వాటికి అంగన్వాడీలు బెదిరేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ దీక్షలకు యు టి ఎఫ్ భీమిలి మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ నాయకులు రాము, సిఐ టి యు జోన్ అధ్యక్షులు రవ్వ నరసింగరావు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) భీమిలి ప్రాజెక్ట్ గౌరవా ద్యక్షులు కె వెంకట లక్ష్మి, జిల్లా కోశాధికారి కె పద్మావతి, ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, కొవ్వాడ లక్ష్మి, దన లక్ష్మి ఎఐటియుసి అనుబంధ సంఘం ప్రతినిధులు అనురాధ తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 26th day protest ntr

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జీవో నెం-2 కాపీలను దగ్ధం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు

anganwadi workers strike 26th day protest gnt rally

  • ఎస్మా ఉపసంహరించుకోవాలని ర్యాలీ 

గుంటూరు : అంగన్వాడీలపై ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్ట్ (ఎస్మా) ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 2 ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు శనివారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్మా భయపడమని సమ్మె కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

 

anganwadi workers strike 26th day protest chittoor

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరవధిక దీక్షలు

anganwadi workers strike 26th day protest vsp

విశాఖ : ఎస్ రాయవరం మండలం అంగన్వాడి నిరసన రోడ్డు మీద పొరలు దండాలతో జగన్మోహన్ రెడ్డి మా కోర్కెలు నెరవేర్చనేసి నిరసన కార్యక్రమం తెలియజేశారు. మమ్ము లక్ష్మి, సీతారత్నం, బాల గౌరీ, వెంకటలక్ష్మి, లక్ష్మి రత్నం, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

anganwadi workers strike 26th day protest alluri

అంగన్వాడీలకు గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర సంఘీభావం

anganwadi workers strike 26th day protest atp

అనంతపురం జిల్లా ఆత్మకూరులో శనివారం 26వ రోజుకు చేరుకున్న సమ్మె కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు

anganwadi workers strike 26th day protest konaseema

  • మండపేటలో 26వ రోజుకు అంగన్వాడీల సమ్మె

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ – మండపేట :  వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడిలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ  కనీస వేతనం 26000, గ్రాడ్యుయేట్, పిఎఫ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించకుండానే సెంటర్లు తెరవాలని ప్రభుత్వం కలెక్టర్ ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తుందని సెంటర్లు తెరవకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతుందని ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు అంగన్వాడీలు భయపడేదిలేదన్నారు. అంగన్వాడీలకు అన్ని ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. సమస్యలు పరిష్కరించుకుంటే అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడిలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

నెల్లూరులో అంగన్వాడీల నిరాహార దీక్ష

 

anganwadi workers strike 26th day protest vja a

విజయవాడలో నిరాహార దీక్ష శిబిరానికి ఐలు రాష్ట్ర నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్,  ఆలూరి సుధాకర్,  రమేష్, సంపర శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి మరియు అంగన్వాడీ రాష్ట్ర జిల్లా నాయకులు తదితర సంఘాల నేతలు హాజరయ్యి  సంఘీభావం తెలిపారు.

 

anganwadi workers strike 26th day protest rayachoti

  • 26వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

అన్నమయ్య జిల్లా – రైల్వేకోడూరు : రైల్వేకోడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 26వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో మాట ఇచ్చావు జగన్ మాట తప్పవు జగన్, భగభగ మండే సూర్యుడిని చూడు అంగన్వాడీల సత్తా చూడు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, సిఐటియు అనుబంధం, జిల్లా అధ్యక్షులు శ్రీ లక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి , అధ్యక్షురాలు, శ్రీరమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్, రాధా కుమారి, మండల కార్యదర్శి జి. పద్మావతి, వెన్నెల,దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఏఐటీయూసీ నాయకులు సరోజ నిర్మల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 26th day protest gnt

  • సమ్మె బాటలోనే అంగన్వాడీలు

గుంటూరు జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న సమ్మెకు సిఐటియు, సిపిఎం పార్టీలు తమ పూర్తి మద్దతును తెలుపుతున్నాయి. 26 రోజులుగా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం దిగిరాకపోవడం దుర్మార్గమని అంగన్వాడి కార్యకర్తలు వాపోతున్నారు. సమ్మె విరమించకపోతే తమ విధుల్లో నుంచి తొలగిస్తామనడం అన్యాయమన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు సూచించారు. అంగన్వాడీలకు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కొల్లిపర బాబుప్రసాద్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎవిఎన్ కుమారి, పి పావని, ఎలిజిబెత్, రంగపుష్ప, విజయలక్ష్మి, అనురాధ, హసీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

➡️