గవర్నర్‌ కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అంగన్‌వాడీల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Jan 6,2024 16:45 #Anganwadi strike

అనంతపురం : అనంతపురంలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటిస్తుండగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలిపారు. గవర్నర్‌ సర్‌ తమ సమస్యలు పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు. నగరంలోని కలెక్టరేట్‌ నుంచి బుక్కరాయసముద్రానికి వెళ్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కాన్వారు వద్దకు అంగన్వాడీలు వెళ్లే ప్రయత్నం చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీ వారి వైపు గవర్నర్‌ చూస్తూ వెళ్లారు.

➡️