ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Feb 7,2024 13:35 #ap assembly
Gurukul Upadhyay problems should be discussed with the help of the central government
  • రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. 2024-2025 వార్షక బడ్జెట్‌‌ను రూ. 2 లక్షల 86 వేల 389 కోట్లతో రూప కల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఆదాయ వ్యయం రూ.2,30,110.41 కోట్లు, మూల ధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు, ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతం, రెవెన్యూ లోటు 1.56 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏడు అంశాలతో బడ్జె‌ట్‌ రూపకల్పన చేసినట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వర్గాన్నీ మర్చిపోకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో బడ్జెట్‌ను రూపొందించామని బుగ్గన వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు బుగ్గన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంలా భావించారన్నారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమన్నారు. చాణుక్యుడిలా రాష్ట్రాన్ని సీఎం జగన్ పాలిస్తున్నారు. 1000 పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోధనా ఆస్పత్రులకు రూ. 16,852 కోట్లు ఖర్చు చేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. విదేశాల్లోని 50 ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు సాయం అందించామన్నారు. డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గిందని తెలిపారు. 34 లక్షల మందికి ఉచితంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశామన్నారు. జగనన్న విద్యా వసతి దీవెనకు రూ. 4,267 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న విద్యా దీవెనకు రూ.11901 కోట్లు విడుదల చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

➡️