ఎపి ఇంటర్‌ ఫలితాలు విడుదల..

  • ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లానే టాప్‌

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌ ఫలితాల్లో 84 శాతం, సెకండియర్‌ ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది.. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81 శాతంతో గుంటూరు జిల్లా సెకండ్‌ ప్లేస్‌లు ఉంది.. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్‌శి సౌరబ్‌ గౌర్‌ మాట్లాడుతూ.. బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.. ఇదే సమయంలో ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌ తొందర పాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.. తల్లి తండ్రులు.. పిల్లలకు సపోర్ట్‌ చేయాలని సూచించారు. ఫెయిల్‌ అయ్యారంటూ పిల్లలను అవమానించవద్దు అని పేరెంట్స్‌ను కోరారు.. ఈసారి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని.. ఈసారి మంచిగా రాసి.. మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఫ‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో పొంద‌వ‌చ్చు.
కాగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.

➡️