18, 20 తేదీల్లో వాకిన్‌ రిక్రూట్‌మెంటు

ap medical services recruitment board secretary srinivasarao

ఎపి వైద్య సర్వీసుల రిక్రూట్‌మెంటు బోర్డు మెంబరు సెక్రటరీ ఎం శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యాన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 170 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 18, 20 తేదీల్లో వాకిన్‌ రిక్రూట్‌మెంటు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య సర్వీసుల రిక్రూట్‌మెంటు బోర్డు మెంబరు సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులను డైరెక్ట్‌, లాటరీ, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు పేర్కొన్నారు. వివిధ స్పెషాలిటీల్లో ఖాళీగా ఉన్న 144 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని అన్నారు. 18, 20 తేదీల్లో విజయవాడ హనుమాన్‌పేట పాత ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డిఎంఇ) కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహుం 2 గంటల వరకు వాకిన్‌ రిక్రూట్‌మెంటు ఉంటుందన్నారు. అలాగే విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌), విశాఖపటుంలోని వివిధ స్పెషాలిటీల్లో ఖాళీగా ఉను 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 15న హనుమంతవాక జంక్షన్‌ విమ్స్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహుం 2 గంటల వరకు వాకిన్‌ రిక్రూట్‌మెంటు ఉంటుందని పేర్కొన్నారు.

➡️