ఎపి రీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల 

Feb 16,2024 07:31 #AP Education

దరఖాస్తుకు మార్చి 19 చివరి గడువు

ప్రజాశక్తి – క్యాంపస్‌ (ఎస్‌వియు) : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పిహెచ్‌డి సీట్ల భర్తీకి ఎపి రీసెట్‌ 2023 -24 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, మార్చి 19 చివరి గడువు అని రీసెట్‌ కన్వీనర్‌ దేవప్రసాద్‌ రాజు తెలిపారు. పరీక్షను ఎస్‌వి యూనివర్సిటీ నిర్వహిస్తోందని తెలిపారు. ఏప్రిల్‌ నాలుగు నుంచి ఏడు వరకు దరఖాస్తుల్లో సవరణలు, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకూ, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకూ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని, సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు పొందిన వారు ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు.

➡️