భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

భద్రాచలం: శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. బుధవారం జరుగనున్న సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. యాత్రికులను దఅష్టిలో పెట్టుకొని అన్నిరకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి రంగులు, విద్యుత్‌ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది.

➡️