కామారెడ్డిలో దారుణ ఘటన

Feb 9,2024 12:20 #Atrocious incident, #kamareddy

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్‌ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్‌, స్రవంతిలపై మొదటి భార్య, బంధువులు దాడి చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నరేష్‌, స్రవంతిలను వివస్త్రులుగా చేసి వారిపై కారం చల్లుతూ దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై నరేష్‌, స్రవంతిలు రామారెడ్డి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️