మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్‌

Jun 17,2024 08:30 #Bakrid, #self-sacrifice

– గవర్నరు, సిఎం చంద్రబాబు, జగన్‌, లోకేష్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్‌ పండగ ముఖ్య ఉద్ధేశమని గవర్నరు అబ్దుల్‌ నజీర్‌, సిఎం నారా చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఐటి మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అన్ని గుణాల కన్నా దాన గుణమే ఉత్తమమైనదని బక్రీద్‌ సారాంశమని, పండగ సందర్భంగా ఖుర్బాని ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారని అన్నారు. హజ్రత్‌ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్‌ పండగను జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ గుణాన్ని ప్రభోదించే బక్రీద్‌ పండగని స్ఫూర్తిగా తీసుకుని సమైఖ్యతను, సమానత్వాన్ని సాదిద్ధామన్నారు.

➡️