2వ రోజు కోలాహలంగా విశాఖ బాలోత్సవం

Dec 15,2023 12:49 #Balotsavam, #Visakha, #visakhapatnam
balotsavam in visakha

ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ : రెండవ రోజు విశాఖ బాలోత్సవం విశాఖ నగరంలోని సెంట్ ఆంటోనీ తెలుగు మీడియం స్కూల్లో ప్రారంభం అయ్యింది. మొదటి రోజు 2 వేల మంది పాల్గొనగా 2వ రోజు అంతకు మించి పాల్గొన్నారు. రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జానపద, క్లాసికల్ బృంద, సోలో నృత్యాలు, లఘు నాటికలు, ఏక పాత్రాభినయం, వాయిద్య గానం, స్టాండ్ అప్ కామిడీలలో పోటీలు జరిగాయి. అదేవిధంగా అకాడమిక్ ఈవెంట్స్ లో వార్త, కధా, కవిత రచన, వ్యాసరచన, డిబేట్, మెమరీ టెస్ట్, కధ చెబుతాను అంశాలపై నిర్వహించడం జరిగింది. పాటలు పాడే వారు పాటకు అనుకూలమైన కాస్ట్యూమ్ తో, మేకప్ తో రావడం అనేది జరిగింది. విద్యార్థులు వారి ప్రతిభను చక్కగా ప్రదర్శిస్తూన్నారు. ప్రాంగణమంతా కూడా విద్యార్థుల కేరింతలతో కోలాహలంగా ఉంది. ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టు ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. పద్యాలు పాడేవారు పౌరాణిక వేషధారణలో వచ్చి పద్యాలు పాడడం ప్రత్యేకoగా వుంది. అనే జరుగుతున్నది ఆ విధంగా పాల్గొన్న పిల్లలు ప్రతి ఒక్కరు పోటీ అంశం స్పాట్లో ఎనౌన్స్ చేసిన చక్కగా వాటి ని అటెంప్ట్ చేశారు. ఇక జానపద నృత్యాలు అయితే స్టేజీ దద్దరిల్లుతున్నది. ఇక్కడ ఒకరికి ఒకరికి పోటీ అనడం తప్పు ఒక్కొక్కరు ఒక క్రియేషన్. అద్భుతమైన వారి వ్యక్తీకరణ నగర పౌరులు చూడవలసినదే. రేపు పూర్తి రోజు కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ వచ్చి తిలకించ వలసినదిగా విశాఖ బాలోత్సవం ప్రధాన కార్యదర్శి జి.ఎస్.రాజేశ్వరరావు కోరారు.

balotsavam in visakha

➡️