చీఫ్‌ జస్టిస్‌ను కలిసిన బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌

Apr 18,2024 22:10 #Bar Council, #CJI Justice

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్‌ ద్వారకానాథ్‌రెడ్డి, ఎస్‌ కృష్ణమోహన్‌ గురువారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిజెను శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన వారిద్దరినీ సిజె అభినందించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని వారిద్దరూ సిజెను కోరారు.

➡️