ఓటర్ల బదిలీ పట్ల అప్రమత్తం : పురందేశ్వరి

Feb 13,2024 08:11 #BJP, #Purandeshwari, #Voter List

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి తమ అభ్యర్థులతోపాటు ఓటర్లను కూడా ఒకచోట నుంచి మరొక చోటుకు బదిలీ చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి విమర్శించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో స్థానికంగా లేనివారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. విశాఖలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

➡️