ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన భాష్యం విద్యార్థులు

ప్రజాశక్తి-గుంటూరు :ఇంటర్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం వెలువడిన జూనియర్‌ ఎంపిసి విభాగంలో భాష్యం ఐఐటి జెఇఇ అకాడమీ విద్యార్థులు ఎం.హేమప్రియ హాసిని, జి.సాయిమనోజ్ఞలు 470 మార్కులకుగాను 466 మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ ఎంపిసిలో 230 మంది విద్యార్థులు 460కిపైగా మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్‌ ఎంపిసి విభాగంలో జి.చంద్రలేఖ్య 1000 మార్కులకుగాను 990, ఎం.లహరి, పి.సాయిమనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించారని చెప్పారు. సీనియర్‌ విభాగంలో మొత్తం 97 మంది విద్యార్థులు 980కిపైగా మార్కులు పొందారని తెలిపారు. జూనియర్‌ బైపిసి విభాగంలో భాష్యం మెడెక్స్‌ విద్యార్థులు ఎల్‌.నవ్య, షేక్‌.వసీమాలు 440 మార్కులకుగాను 436 మార్కులు సాధించారని, మొత్తం 68 మంది 430కిపైగా మార్కులు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. సీనియర్‌ బైపిసి విభాగంలో ఎం.హంసిని లాలిత్య, ఐ.యోషిత వెయ్యి మార్కులకుగాను 985, ఎన్‌.శ్రీషా 984 మార్కులు పొందారన్నారు. ఇంతటి ఘన విజయాలు సాధించటానికి అత్యుత్తమ విద్యాప్రణాళికలతోపాటు, అధ్యాపకులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని తెలిపారు. ఆయా విద్యార్థులను రామకృష్ణ, డైరెక్టర్‌ హనుమంతరావు అభినందించారు.

➡️