ఒకే కాన్పులో మూడు లేగ దూడల జననం

ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా గన్నవరం మండలం అల్లాపురం పశువుల ఆస్పత్రిలో సోమవారం ఒంగోలు జాతికి చెందిన ఆవు ఒకే కాన్పులో మూడు లేగ దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆవులు ఒక కాన్పులో ఒక దూడకు జన్మనిస్తాయి. అయితే, ఒక్కోసారి రెండు దూడలకు జన్మనివ్వడం అరుదుగా జరుగుతుంది. కానీ, ఒకే కాన్పులో మూడు లేగ దూడలను జన్మించడం అత్యంత అరుదని పశు సంవర్థక సహాయక సంచాలకులు డాక్టర్‌ కె.రాధాకృష్ణమూర్తి తెలిపారు.

➡️