జగిత్యాలలో బిజెపి విజయ సంకల్ప యాత్ర

Mar 18,2024 12:38 #BJP, #jagityala, #PM Modi, #speech

జగిత్యాల (తెలంగాణ) : ఎన్నికల నగారా మోగిన వేళ … ప్రధాన పార్టీలన్నీ జోష్‌ పెంచాయి. ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సోమవారం జగిత్యాలలో బిజెపి విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను నిర్వహించింది. సభ కోసం బిజెపి భారీ జనసమీకరణను చేపట్టింది. మరోవైపు సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను కూడా బిజెపి నేతలు చేశారు. పోలీసుల బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు.

సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి మాట్లాడుతూ … కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న ఎపిలో జరిగిన సభలోనూ ప్రధాని మోడి మాట్లాడుతూ … ఇండియా బ్లాక్‌ పై విమర్శలు చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గురించి కనీస ప్రస్తావన కూడా తేలేదు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ తమ లక్ష్యం అని చెప్పిన ప్రధాని మోడి … సమస్యలను పరిష్కరించకుండా వికసిత రాష్ట్రం ఎలా సాధ్యపడుతుందో వివరించనూ లేదు. ఇదే తరహాలో … తెలంగాణలోనూ మోడి నేను భరతమాత పూజారిని.. స్త్రీలు శక్తి స్వరూపులు.. అంటూ.. ఉత్తి మాటలు చెప్పారు.. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పైగా ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు పక్కా ..! అన్నారు. ఏవిధంగానైనా మాటల గారడీలతో మాయ మాటలతో ఓట్ల బ్యాంకును కొల్లగొట్టాలని.. అధికారాన్ని చేపట్టాలని ప్రధాని మోడి ప్రజలకు వేస్తున్న మాటల గాలాలను ప్రజలు గుర్తించనూపోరు.

ఉత్త మాటలే…!

➡️