రత్నగిరి కొండపై విరిగిన షెడ్డు – ఇద్దరికి తీవ్రగాయాలు

ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : భారీ వర్షాలకు రత్నగిరి పై ఉన్న షెడ్డు విరగడంతో ఇద్దరు భక్తులకు తీవ్రగాయాలైన ఘటన బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరిగింది. దేవాలయం రత్నగిరి కొండ పైన వార్షిక కళ్యాణ వేదిక వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్డు జడివాన దెబ్బకు విరిగింది. షెడ్డులో విశ్రాంతి తీసుకుంటున్న సత్తెనపల్లి గొల్లపల్లి ప్రాంతాలకు చెందిన ఆదిలక్ష్మి, గురమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి మెరుగైన చికిత్సను అందించేందుకు వెంటనే కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

➡️