బిటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Jun 16,2024 14:49 #btech student, #commits suicide

ఇబ్రహీంపట్నం : బిటెక్‌ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో జరిగింది. ఎస్‌ఐలు రామకృష్ణ, మైబెల్లి వివరాల మేరకు … ఖమ్మం జిల్లా అరుపాలెం మండలం, మామునూర్‌ గ్రామానికి చెందిన సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదిబట్ల ఏరోస్పేస్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంబిఆర్‌ నగర్‌లోని ఎస్‌వి బార్సు హాస్టల్‌ లో ఉంటున్నాడు. గత శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్‌ లోని రెండో అంతస్తులోని తన గదిలో బెడ్‌ షీట్‌తో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్‌ కోసం నగరానికి వెళ్లిన రూంమేట్స్‌ తిరిగివచ్చి చూసేసరికి నరేంద్ర విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు హాస్టల్‌ యజమాని వేణుకు సమాచారం ఇచ్చారు. వెంటనే మఅతుని కుటుంబసభ్యులు, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మృతుని తండ్రి రాంబాబు, బంధువులు శనివారం ఉదయం హాస్టల్‌కు చేరుకుని బోరున రోదించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మఅతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా నరేంద్ర మొబైల్‌ ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ కాలేదు. కాల్‌ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఆర్థిక ఇబ్బందులా లేక మరేమైనా ఉన్నాయా అనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

➡️