తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు – వాడీవేడి చర్చలు

తెలంగాణ : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో … కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ ల మధ్య వాడీ వేడి చర్చ కొనసాగుతోంది.

సభలో తమకూ ప్రజెంటేషన్‌ అవకాశం ఇవ్వాలని బిఆర్‌ఎస్‌ కోరగా, బిఆర్‌ఎస్‌ విజ్ఞప్తిని స్పీకర్‌ తిరస్కరించారు. సభలో సభ్యులకు ప్రజెంటేషన్‌ ఇవ్వబోమని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. అసెంబ్లీలో రెండు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసింది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ మాట్లాడుతూ … కెసిఆర్‌ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలన్నారు. కేఆర్‌ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కెసిఆరేనని ఆరోపించారు. రాజకీయాల నుంచి కెసిఆర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని తాము గాడిలో పెడుతున్నామన్నారు. నల్లగొండ జిల్లాకు కెసిఆర్‌, జగదీష్‌ రెడ్డి తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు అని చెప్పింది. ఎపి సిఎం జగన్‌ కృష్ణా జలాలపై మాట్లాడలేదనీ.. గోదావరి జలాలపై మాట్లాడారని స్పష్టం చేసింది. దీన్ని కాంగ్రెస్‌ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.

➡️