వచ్చే నెలలో బడ్జెట్‌ భేటీలు- మూడోవారంలో నిర్వహణ

Jun 18,2024 21:35 #budget meetings, #next month-

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి:వార్షిక బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెలలో నిర్వహిరచనున్నారు. జూలై మూడో వారంలో ఈ భేటీలను నిర్వహిరచనున్నట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. ఐదు నుంచి ఆరు రోజులపాటు ఈ సమావేశం జరిగే అవకాశ ఉందని సమాచారం. మార్చిలో జరిగిన ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తొలి నాలుగు నెలలకు శాసనసభ అనుమతిని తీసుకున్నారు. దింతో తప్పనిసరిగా జూలైలోగా తుది బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అందుకే వచ్చే నెలాఖరులోగా సమావేశాలను ముగించి సభ అనుమతి పొందాలని భావిస్తున్నారు.

➡️